ఎన్టీఆర్, ప్రశాంత్‌నీల్ సినిమాలో హీరోయిన్‌గా ‘రుక్మిణి వసంత్‌ను తీసుకున్నారు. అయితే ఈ విషయం బైటకొచ్చాక రుక్మిణి నటించిన మదరాసి ఫ్లాప్ అయింది. అసలు ఈ అమ్మడికి ఈమధ్య కాలంలో హిట్టే లేదు. దీంతో ఈ అమ్మడిపై ఐరెన్ లెగ్ ముద్రపడింది. కోరి కోరి రుక్మిణిని హీరోయిన్‌గా తీసుకున్నారన్న భయం తారక్ ఫ్యాన్స్‌లో వుండిపోయింది. అయితే ఈ భయాన్ని కాంతార చాప్టర్ 1 హిట్ పోగొట్టింది. 2019లో వెండితెరపైకి అడుగుపెట్టిన రుక్మిణి, రక్షిత్‌శెట్టితో నటించిన ‘సప్త సముద్రాలు దాటి’…