Ponnam Prabhakar: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కేంద్రీకృత పోర్టల్ ‘‘వాహన్ సారథి’’లోకి నేడు ( ఏప్రిల్ 30)న తెలంగాణ రాష్ట్రము చేరింది. సికింద్రాబాద్ లో ఉన్న RTO కార్యాలయంలో పైలెట్ ప్రాజెక్ట్ గా ‘సారధి పోర్టల్’ ప్రారంభోత్సవం చేసారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో వాహనదారులకు డిజిటల్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కొత్తగా సారధి పోర్టల్ ను లాంచ్ చేశారు. వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అన్ని సేవలను సులభతరం చేసేందుకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది.…