సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన చేసింది. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తో అన్ని సమస్యల పరిష్కారాలపై చర్చించినట్లు తెలిపింది. మంత్రి హామీతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న యుద్ధ వాతావరణ పరిస్థితులు, మంత్రి హామీతో సమ్మె తాత్కాలికంగా విరమించుకున్నట్లు జేఏసీ నేతలు వెల్లడించారు. హామీలు నెరవేర్చకపోతే భవిష్యత్ లో సమ్మె తప్పదని హెచ్చరించారు. సమస్యల పరిష్కారానికి సీఎంతో మాట్లాడి దశల వారీగా పరిష్కారం ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.
Alert.. Alert: తెలంగాణ ప్రజలు పగటి పూట పనుల మీదూ, పండుగ పూట ఊరెళ్లాలనే ప్రణాళికలలో బిజీగా ఉన్న ఈ సమయంలో… ఒక్కసారిగా ఒక బిగ్ అలర్ట్ వచ్చింది. “బస్సులు బంద్!”.. అవును, ఈ అర్థరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా RTC బస్సులు ఆగిపోనున్నాయి. జనజీవనం స్తంభించనున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్‌కి ఇది భలే ఛాన్స్… రెట్లు రేట్లతో డబ్బు దండుకునే సమయం వచ్చేసింది. గతంలో ఎన్నోసారి చూసిన దృశ్యం మళ్లీ రిపీట్ కానుంది. ప్రయాణికుల…
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ నిరవధిక సమ్మెకు మే 7వ తేదీ నుంచి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో, ప్రభుత్వం తో చర్చలకు సిద్ధమని ప్రకటించింది. మే డే సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిగణనలోకి తీసుకుంటామని, వారితో చర్చలకు సిద్ధమని తెలిపారు. సమ్మెకు వెళ్లకుండా సమస్యల పరిష్కారం కోసం సంయమనం పాటించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
TGSRTC Strike: తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఉద్యోగుల డిమాండ్లపై రాష్ట్ర కాంగ్రెస్ స్పందించకపోవడంతో మే 7వ తేదీ నుండి నిరవధిక సమ్మె చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు (JAC) నిర్ణయించాయి. ఈ సందర్బంగా సమ్మె సంబంధించిన పోస్టర్ ను ఆర్టీసీ కార్మిక జేఏసీ ఆవిష్కరించింది. మే డే స్పూర్తితో ఆర్టిసి సమ్మెకు సిద్దం అయ్యింది జేఏసీ. ఇప్పటికైన అయిన ప్రభుత్వం స్పందించి సమస్యల నివారణకు చర్యలు చేపట్టాలని, మా న్యాయమైన డిమాండ్ ల…
TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (RTC)లో మరోసారి సమ్మె మేఘాలు కమ్ముకుంటున్నాయి. కార్మికులు, ఉద్యోగులు గత కొంతకాలంగా తమ డిమాండ్ల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ, అధికార యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మూడు సార్లు సమ్మె నోటీసులు ఇచ్చిన RTC JAC, తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి సమ్మె మార్గాన్ని ఎంచుకోవడానికి సిద్ధమవుతోంది. ఆర్టీసీ యాజమాన్యం తమ సమస్యలపై చర్చలు జరిపేందుకు ముందుకు రావాలని ఉద్యోగులు కోరుతున్నప్పటికీ, ఇప్పటివరకు…