తెలంగాణ ఆర్టీసీని గాడిన పెట్టేందుకు ఎండీ వీసీ సజ్జనార్ నడుం బిగించారు. ఇప్పటికే సిబ్బందిలో జవాబుదారీ తనం పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఆర్టీసీ బాస్ ఇప్పుడు ఆదాయ వనరులు పెంచేందుకు, ఖర్చులు తగ్గించే పనిలో పడ్డారు. అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో అదనపు సిబ్బందిని తగ్గించాలని ఆయన నిర్ణయించారు. బస్ భవన్‌లో ఖర్చులు తగ్గించడం, అవసరం లేని సిబ్బందిని ఇతర విభాగాలకు కేటాయించడం చేయాలని నిర్ణయించారు. అదనపు సిబ్బందిని గుర్తించాలని, ఆదాయం పెంచుకునే కొత్త మార్గాలను అన్వేషించాలని ఉన్నతాధికారులకు సూచించారు…
తార్నాక ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని నిర్ణయించాం. ఆర్టీసీకి ఆదాయం పెరిగింది. డయాలసిస్, 24గంటలు ఫార్మా యూనిట్ ఐసీయూ ఏర్పాటుచేస్తాం అన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. అందుకోసం ప్రణాళికలు రూపొందించామని, డయాలసిస్, 24గంటలు ఫార్మా యూనిట్ ఐసీయూ ఏర్పాటు చేశామన్నారు. మార్చి లోపు కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిద్దుతాం. లేగాటో, డిబీఎస్ నుంచి దాతలు కూడా ముందుకువచ్చారు. రికార్డ్ స్థాయికి ఆర్టీసీ ఆదాయం పెరిగింది. ఉద్యోగుల సంక్షేమం కోసం యాజమాన్యం ఎప్పుడూ ముందుంటుంది. ఉద్యోగులంతా…