రంగారెడ్డి జిల్లాలో పాఠశాల బస్సులపై రవాణా శాఖ అధికారులు దాడులు కొనసాగుతున్నారు. రాజేంద్రనగర్, మియాపూర్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, ఉప్పల్ లో అధికారుల బృందం తనిఖీలు చేస్తున్నారు.
Varahi: పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి సంబంధించి మరో ట్విస్ట్ నెలకొంది. ఈ వాహనం రిజిస్ట్రేషన్ వాయిదా పడిందని వార్తలు వచ్చి కొద్దిగంటలు కూడా ముగియకముందే వారాహి రిజిస్ట్రేషన్ ఎప్పుడో పూర్తయిందని తెలంగాణ రవాణా శాఖ వెల్లడించింది. దీంతో జనసేన పార్టీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారాహికి లైన్ క్లియర్ అయిందని.. ఈ వాహనానికి అన్ని అనుమతులు ఉన్నాయని.. వారం కిందటే రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందని స్వయంగా తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పాపారావు వెల్లడించారు.…