Sabarimala: కేరళ ప్రభుత్వం శబరిమలకు వచ్చే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది మండలం- మకరవిలక్కు యాత్రా సీజన్‌లో శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఉచిత బీమా కల్పించనుంది.
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. సైబర్ దుండగులు వివిధ మార్గాల్లో ప్రజలను ట్రాప్ చేస్తున్నారు. మౌయిమా ప్రాంతంలో కొత్త కేసు వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఫేస్‌బుక్‌లో ఒక వినియోగదారు.. ధనిక కుటుంబాలకు చెందిన అమ్మాయిలను ప్రెగ్నెంట్ చేస్తే రూ. 5 లక్షల జీతంతో ఉద్యోగం ఇస్తానని తెలిపాడు. ఈ ఆఫర్ చూసి ఓ యువకుడు ట్రాప్‌లో పడ్డాడు.
రైతు బీమా తరహాలో.. గల్ఫ్ కార్మికుల బీమా అందిస్తామని ప్రకటించారు. ఇందులో గల్ఫ్ కార్మికుల ప్రమాద భీమా రూ. 5 లక్షలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక, గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ విభాగానికి సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమిస్తాం అని తెలిపారు. జూన్, జులైలో పాలసీ డాక్యుమెంట్ విడుదల చేస్తామన్నారు.