ప్రకాశం జిల్లా ఒంగోలులో శిశువు విక్రయం కలకలం రేపింది. ఒంగోలు రిమ్స్ లో రూ. పది వేలకు కన్న కూతురుని విక్రయించింది తల్లి. ఆమె అంగన్వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తుంది. కాగా.. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కల్లూరుకి చెందిన ఓ వ్యక్తికి మధ్యవర్తుల ద్వారా విక్రయించింది. అయితే.. పాపను వారికి అమ్మిన తర్వాత రిమ్స్ లో కనిపించకుండా పోయింది అంగన్వాడీ కార్యకర్త.