దర్శక ధీరుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం ఆయన సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను చూసుకుంటున్నారని కొందరు చెబుతున్నారు. షూటింగ్ పూర్తవ్వడంతో “ఆర్ఆర్ఆర్” పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆ పని కోసం రాజమౌళి అన్నపూర్ణ స్టూడియోస్‌లోకి అడుగు పెట్టారు. అయితే ఇప్పుడు రాజమౌళి అన్నపూర్ణ స్టూడియోలో కన్పించడం చర్చనీయంశంగా మారింది. దీనికి సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు ఆ పిక్ సరికొత్త అనుమానాలకు తెర…
“ఆర్ఆర్ఆర్” మేకర్స్ నిన్ననే సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యిందని స్పష్టం చేసారు. ప్రసతుతం సినిమా టీం పోస్ట్ ప్రొడక్షన్ పనులపై పూర్తిగా దృష్టి పెట్టింది. అయితే కొంతకాలంగా సినిమా విడుదల తేదికి సంబంధించి గందరగోళం నెలకొంది. తాజా సమాచారం ప్రకారం సినిమాను జనవరి నాటికి పూర్తి చేసి సంక్రాంతి బరిలో దింపబోతున్నారట. ఈ మేరకు మేకర్స్ థియేటర్స్ లాక్ చేయమని డిస్ట్రిబ్యూటర్లకు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ప్రోస్ట్ ప్రొడక్షన్…
పలు సూపర్ హిట్ చిత్రాల రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇటీవలి లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. పూర్తిగా పెంచిన తెల్లని గడ్డంతో ఋషిలా కనిపిస్తున్నారాయన. అయితే ఈ లుక్ ఇప్పుడు ఓ ఆసక్తికరమైన అంశానికి కేంద్రబిందువు అయింది. మనదేశ ప్రధాని నరేంద్ర మోడి సైతం గత కొంత కాలంగా పూర్తిగా పెంచిన తెల్లని గడ్డంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇదే ఇప్పుడు ఓ యువ రచయితలో కొత్త ఆలోచన పుట్టడానికి కారణమైంది. Read Also : ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్…
ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి తీస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థలు ట్వీట్ ద్వారా తెలియచేశాయి. ఒకటి రెండు పికప్ షాట్స్ తప్ప సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని, నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, రిలీజ్ తదితర ఇతర అప్ డేట్స్ ని వీలయినంత త్వరగా ప్రకటిస్తామని మీడియాకు తెలియచేశాయి. Read Also : ట్రోల్ కి గురవుతున్న ప్రభాస్ కొత్త లుక్ ఇటీవల ఉక్రెయిన్ లో…
టాలీవుడ్ టాప్ స్టార్ ఎన్టీఆర్ తన విలువైన కారు లంబోర్ఘిని ఉరుస్‌తో కలసి పోజిచ్చాడు. తనతో పాటు హీరో శ్రీకాంత్, కాకినాడ టిడిపి ఎంపిగా పోటీచేసిన సునీల్ కుమార్ చలమలశెట్టితో కలిసి కారుముందు నిలబడి పోజులిచ్చాడు. ఇండియాలో తొలి లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ యజమాని ఎన్టీఆర్ కావటం విశేషం. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తి చేసి ఉక్రెయిన్ నుంచి తిరిగి రాగానే లంబోర్ఘిని డెలివరీ తీసుకున్నాడు ఎన్టీఆర్. Read Also : హిలేరియస్ గా “101 జిల్లాల…
2018లో “ఆర్ఆర్ఆర్” సినిమాను ప్రకటించారు. అప్పటి నుంచే ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి విడుదల తేదీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇప్పటికే మూడు సార్లు మార్చారు. మొదట్లో 30 జూలై 2020 అన్నారు. ఆ తర్వాత సినిమా 8 జనవరి 2021కి మారింది. ఈ తేదీ నుండి ఇప్పుడు 2021 అక్టోబర్ 13కి మార్చారు. ఇప్పటికి కూడా “ఆర్ఆర్ఆర్” అక్టోబర్ 13న విడుదలవుతుందనే నమ్మకం లేదు.…
మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ ఉక్రెయిన్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుని స్టార్ హీరోలు ఎన్టీయార్, రామ్ చరణ్ ఒక రోజు అటూ ఇటూగా హైదరాబాద్ చేరుకున్నారు. అయితే బాలెన్స్ వర్క్ పూర్తి చేయడానికి డైరెక్టర్ రాజమౌళి బృందం ఉక్రెయిన్ లోనే ఉండిపోయింది. శుక్రవారంతో ఆ పనులు కూడా పూర్తి అయిపోయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే… ఇన్ స్టాగ్రామ్ లో ఉక్రెయిన్ లో పాల్గొన్న టోటల్ టెక్నికల్ టీమ్ తో కలిసి రాజమౌళి గ్రూప్ ఫోటో దిగాడు.…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హైదరాబాద్ విమానాశ్రయంలో కన్పించాడు. ఆ పిక్స్ ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ “ఆర్ఆర్ఆర్” చివరి షెడ్యూల్ ని ఉక్రెయిన్ లో ముగించుకుని తిరిగి హైదరాబాద్ వచ్చాడు. ఈ రోజు ఉదయం ఆయన ఎయిర్ పోర్టులో కంపించడంతో కెమెరాలు క్లిక్ అన్నాయి. చరణ్ బ్లాక్ హూడీ, బ్లాక్ జీన్స్ ధరించి, మ్యాచింగ్ మాస్క్, టోపీ ధరించాడు. అయినప్పటికీ అభిమానులు ఆయనను గుర్తు పట్టేశారు. మిగతా “ఆర్ఆర్ఆర్” టీం…
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పిరియాడికల్ యాక్షన్ డ్రామా “ఆర్ఆర్ఆర్”. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఆగష్టు మొదటి వారంలో సినిమా చివరి షెడ్యూల్ కోసం హీరోలతో సహా “ఆర్ఆర్ఆర్” టీం మొత్తం ఉక్రెయిన్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ నిన్న పూర్తయ్యింది. దీంతో నిన్ననే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చేశారు. బుధవారం ఉదయం ఎన్టీఆర్ హైదరాబాద్ విమానాశ్రయంలో క్యాజువల్ లుక్ లో కన్పించిన పిక్స్ ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టాయి.…
కొన్ని రోజుల క్రితం “ఆర్ఆర్ఆర్” సినిమా షూటింగ్ కోసం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ చిత్ర బృందంతో కలిసి ఉక్రెయిన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆగస్టు 1న రామ్ చరణ్, “ఆర్ఆర్ఆర్” బృందంతో కలిసి తారక్ ఉక్రెయిన్ వెళ్లాడు. ఉక్రెయిన్‌లో 15 రోజుల పాటు షూటింగ్ చేశారు. ఉక్రెయిన్‌లో ఎస్ఎస్ రాజమౌళి ఒక సాంగ్ ను చిత్రీకరించారు. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ తన పార్ట్ షూట్‌ను ఉక్రెయిన్‌లో పూర్తి చేసి తాజాగా హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు…