థియేట్రికల్ ట్రైలర్ విడుదలతో దేశవ్యాప్తంగా “ఆర్ఆర్ఆర్” మ్యానియా మొదలైంది. గత రెండు రోజుల్లో వివిధ నగరాల్లో క్విక్ ఫైర్ ప్రెస్ మీట్‌లకు హాజరు కావడం ద్వారా మేకర్స్ కూడా దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించారు. రోజులు గడిచేకొద్దీ హైప్ పెరుగుతుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండగా, విడుదలకు ముందు ప్రీమియర్ షోలు వేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఇంతకు ముందు రాజమౌళి దర్శకత్వంతో వచ్చిన ‘బాహుబలి 2’ ప్రీమియర్‌లను ప్రదర్శించగా, దానికి అద్భుతమైన స్పందన వచ్చింది.…