కొత్త సంవత్సరం స్టార్ట్ అయ్యింది. ఈ ఏడాది ప్రథమార్థంలో థియేటర్లలో సందడి చేయడానికి పెద్ద సినిమాలన్నీ తయారుగా ఉన్నాయి. అయితే మరోవైపు పెరుగుతున్న కరోనా, ఒమిక్రాన్ కేసులు భయపెడుతున్నాయి. అంతేకాదు దేశంలోని పలు రాష్ట్రాల్లో అమలవుతున్న ఆంక్షలు కూడా సినీ ప్రియులతో పాటు మేకర్స్ ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే న్యూఇయర్ సందర్భంగా సినిమా ప్రేమికులకు షాకింగ్ వార్త చెప్పబోతున్నారట ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్. Read Also : విజయ్ దేవరకొండపై మనసు పారేసుకున్న…
2018లో “ఆర్ఆర్ఆర్” సినిమాను ప్రకటించారు. అప్పటి నుంచే ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి విడుదల తేదీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇప్పటికే మూడు సార్లు మార్చారు. మొదట్లో 30 జూలై 2020 అన్నారు. ఆ తర్వాత సినిమా 8 జనవరి 2021కి మారింది. ఈ తేదీ నుండి ఇప్పుడు 2021 అక్టోబర్ 13కి మార్చారు. ఇప్పటికి కూడా “ఆర్ఆర్ఆర్” అక్టోబర్ 13న విడుదలవుతుందనే నమ్మకం లేదు.…