కొత్త సంవత్సరం స్టార్ట్ అయ్యింది. ఈ ఏడాది ప్రథమార్థంలో థియేటర్లలో సందడి చేయడానికి పెద్ద సినిమాలన్నీ తయారుగా ఉన్నాయి. అయితే మరోవైపు పెరుగుతున్న కరోనా, ఒమిక్రాన్ కేసులు భయపెడుతున్నాయి. అంతేకాదు దేశంలోని పలు రాష్ట్రాల్లో అమలవుతున్న ఆంక్షలు కూడా సినీ ప్రియులతో పాటు మేకర్స్ ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే న్యూఇయర్ సందర్భంగా సినిమా ప్రేమికులకు షాకింగ్ వార్త చెప్పబోతున్నారట ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్.
Read Also : విజయ్ దేవరకొండపై మనసు పారేసుకున్న బీటౌన్ బ్యూటీ… హిట్ రీమేక్ కోసం తపన !
దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పుడు మరోమారు వాయిదా పడిందని అంటున్నారు. దేశంలో మహమ్మారి పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న రాజమౌళి, ఆయన బృందం సినిమా విడుదలకు కోసం మరో డేట్ ను ఫిక్స్ చేయాలని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక, న్యూఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూలతో పాటు థియేటర్లలో 50% ఆక్యుపెన్సీ, ఇంకా పలు ఆంక్షలు విధించారు. ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతంగా వ్యవథి చెందుతున్న తరుణంలో ఇతర రాష్ట్రాలు లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి.
దీంతో నిర్మాతలు ‘ఆర్ఆర్ఆర్’ విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారట. వాయిదాపై ఈరోజు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. రాజమౌళి అండ్ టీం ఈ చిత్రాన్ని దూకుడుగా ప్రమోట్ చేసారు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ను రాజమౌళి 2022 వేసవిలో విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటిదాకా తగ్గేదే లే అంటూ సినిమా విడుదలపై క్లారిటీ ఇస్తూ వచ్చిన మేకర్స్ మరి ఇప్పుడు ఏమంటారనేది ఆసక్తికరంగా మారింది. 1920 నాటి పీరియాడిక్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్ మరియు ఒలివియా మోరిస్ ప్రధాన పాత్రలు పోషించారు.