త్వరలో రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందచేయాలన్న సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయంపై విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి పట్టాదారు పాసుపుస్తకం పై రాజముద్ర వేసి ఇస్తామని చెప్పిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని అన్నారు.
సీఎం చంద్రబాబు చేపట్టిన రెవెన్యూ సమీక్షలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజల పాసు పుస్తకాలపై తన బొమ్మల కోసం రూ.15 కోట్లు తగలేశారంటూ జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు, ప్రజల కోరిక మేరకు రాజముద్రతో కొత్త పాసు పుస్తకాలు ఇచ్చేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకోనుంది.