Mars: సౌర కుటుంబంలో భూమి తర్వాత నివాసయోగ్యంగా ఉండే గ్రహాల్లో ముఖ్యమైంది అంగారకుడు. భూమి లాగే మార్స్ కూడా నివాసయోగ్యానికి అనువైన ‘గోల్డీ లాక్ జోన్’లో ఉంది. కొన్ని బిలియన్ ఏళ్ల క్రితం భూమి లాగే అంగాకరకుడు కూడా సముద్రాలు, నదులు, వాతావరణం కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అందుకనే అన్ని దేశాల అంతరిక్ష సంస్థలు మార్స్‌పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాయి.