ప్రముఖ నటుడు, డిఎండికె (దేశీయ ముర్పోకు ద్రవిడ కజగం) చీఫ్ విజయకాంత్ నిన్న రాత్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తన పార్టీ పత్రికా ప్రకటన ప్రకారం విజయకాంత్ సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం మే 19న చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అయితే మరోవైపు మే 19న విజయకాంత్ కు శ్వాస సమస్యలు రావడంతో ఆయనను తెల్లవారుజామున 3 గంటలకు ఆసుపత్రికి తరలించినట్టుగా వార్తలు విన్పించాయి. వైద్యులు అతన్ని పరీక్షించారు మరియు కోవిడ్ -19…