ప్రముఖ నటుడు, డిఎండికె (దేశీయ ముర్పోకు ద్రవిడ కజగం) చీఫ్ విజయకాంత్ నిన్న రాత్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తన పార్టీ పత్రికా ప్రకటన ప్రకారం విజయకాంత్ సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం మే 19న చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అయితే మరోవైపు మే 19న విజయకాంత్ కు శ్వాస సమస్యలు రావడంతో ఆయనను తెల్లవారుజామున 3 గంటలకు ఆసుపత్రికి తరలించినట్టుగా వార్తలు విన్పించాయి. వైద్యులు అతన్ని పరీక్షించారు మరియు కోవిడ్ -19 పరీక్షను కూడా నిర్వహించారు. కరోనా నెగెటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. ఇక తన సాధారణ ఆరోగ్య పరీక్షలు పూర్తి చేసుకున్న తరువాత విజయకాంత్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. మే 20న రాత్రి విజయకాంత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన పార్టీ సభ్యులు విజయకాంత్ బాగానే ఉన్నారని, ఆయన ఆరోగ్యం గురించి పుకార్లు వ్యాప్తి చేయవద్దని అందరినీ కోరారు. కాగా 2020 సెప్టెంబరులో కరోనా తేలికపాటి లక్షణాలు కంపించడంతో విజయకాంత్ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. విజయకాంత్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాక అతని భార్య ప్రేమలత కూడా కరోనా బారిన పడ్డారు. దాదాపు 10 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందిన తరువాత ఈ జంట అక్టోబర్ 2 న డిశ్చార్జ్ అయ్యారు.