వెంకటేశ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, ఖుష్బు, శిల్పా శెట్టి, టబు… ఇలా అనేక మంది స్టార్స్ ని తెలుగు తెరకు పరిచయం చేసిన విశిష్ట దర్శకుడు ‘వశిష్ట’గా విచ్చేశాడు! ఎస్… దర్శకేంద్రుడు తన శతాధిక చిత్రాల సుదీర్ఘ ప్రయాణం తరువాత గేరు మార్చి నటుడిగా మన ముందుకొచ్చేశాడు. ‘పెళ్లిసందడి’ సినిమాతో ఆయన తెర మీదకు వస్తోన్న సంగతి మనకు తెలిసిందే. అయితే, తాజాగా ఆయన ఫస్ట్ లుక్ రివీల్ చేస్తూ మేకర్స్ ఓ వీడియో రిలీజ్…
దర్శకేంద్రుడు ఇటీవలే పెళ్లిసందడి చిత్రానికి సీక్వెల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ‘పెళ్లి సందD’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడం లేదు. కేవలం దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేపట్టనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో రాఘవేంద్రరావు కీ రోల్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాను కొత్త దర్శకురాలు గౌరి రోనక్ చిత్రీకరించనున్నారు. హీరో రోషన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇక…