వెంకటేశ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, ఖుష్బు, శిల్పా శెట్టి, టబు… ఇలా అనేక మంది స్టార్స్ ని తెలుగు తెరకు పరిచయం చేసిన విశిష్ట దర్శకుడు ‘వశిష్ట’గా విచ్చేశాడు! ఎస్… దర్శకేంద్రుడు తన శతాధిక చిత్రాల సుదీర్ఘ ప్రయాణం తరువాత గేరు మార్చి నటుడిగా మన ముందుకొచ్చేశాడు. ‘పెళ్లిసందడి’ సినిమాతో ఆయన తెర మీదకు వస్తోన్న సంగతి మనకు తెలిసిందే. అయితే, తాజాగా ఆయన ఫస్ట్ లుక్ రివీల్ చేస్తూ మేకర్స్ ఓ వీడియో రిలీజ్ చేశారు! దర్శకేంద్రుడి శిష్యుడు, దర్శక ధీరుడు… రాజమౌళి ఆ వీడియోని ట్విట్టర్ లో షేర్ చేశాడు…
Read Also : ‘వాస్తవ్’ స్టార్ జీవితంలోని… నమ్మశక్యం కాని ‘వాస్తవలు’!
తన సినిమాల్లో చాలా సార్లు పూబంతులు విసిరేయించిన రాఘవేంద్ర రావు స్వయంగా తానే బరిలోకి దిగితే మాత్రం బాస్కెట్ బాల్ బంతిని ఎంచుకున్నాడు. వశిష్ట పాత్రలో తొలిసారి నెటిజన్స్ కు దర్శనం ఇచ్చిన ఆయన గురి చూసి బాస్కెట్ లోకి బాల్ ని విసిరాడు! సూటు, బూటు వేసి గాగుల్స్ పెట్టి స్టైలిష్ గా కనిపించాడు. ఇక యంగ్ హీరో, శ్రీకాంత్ తనయుడు రోషన్ కూడా వీడియోలో దర్శకేంద్రుడితో కలసి కనిపించాడు! అనాటి ‘పెళ్లి సందడి’ సినిమా హీరోయిన్ దీప్తి భట్నాగర్ తో పాటూ రాజేంద్రప్రసాద్ ని కూడా మనం వీడియోలో చూడవచ్చు! చూడాలి మరి, మన దర్శక దిగ్గజం నటుడిగా ఎలా మెప్పిస్తాడో…