సంక్రాంతి పండగ వేళ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకపక్క పోలీసుల దాడులు కొనసాగుతున్నా.. మరొక పందెం నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తూనే ఉన్నారు. వేల సంఖ్యలో తరలివచ్చే జనం కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ షామియానాలు, టెంట్లు, ఎల్ఈడీ స్క్రీన్లు, పార్కింగ్ సౌకర్యాలతో కోడి పందాల బరులు సిద్ధమవుతున్నాయి. కోడి పందాలతో పాటు గుండాట, పేకాట నిర్వహణకు సైతం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి…
ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. సంక్రాంతి మొదటి రోజు భోగి సందర్భంగా ఊరూరా భోగి మంటలు వేసి పండుగను ప్రారంభించారు. ఇక సంక్రాంతికి ప్రత్యేకంగా చెప్పుకునే సంప్రదాయ కోళ్ల పందాలు మొదలయ్యాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందాల కోలాహలం కొనసాగుతుంది. బరుల్లో కోడిపుంజులు పందానికి కాలు దువ్వుతున్నాయి.