అనకాపల్లి జిల్లాలో కోడికత్తి దాడి కేసు కులం రంగు పులుముకుంది. నిందితులపై చర్యలు చేపట్టాలని ప్రత్యర్థి వర్గం రోడ్డెక్కడం ఉద్రిక్తతకు దారితీసింది. బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామానికి చెందిన యువకులు మధ్య కనుమపండుగ రోజు కోడి పందాల విషయంలో వాగ్వివాదం జరిగింది.
ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. సంక్రాంతికి ప్రత్యేకంగా చెప్పుకునే సంప్రదాయ కోళ్ల పందాలు జోరుగా జరుగుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోడి పందాల కోలాహలం కొనసాగుతోంది. బరుల్లో కోడిపుంజులు పందానికి కాలు దువ్వుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్‌లో సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు నిర్వహించిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.16,320 స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎనిమిది మంది వ్యక్తులు వికారాబాద్ జిల్లా యాలాల్ మండలంలో కోడి పందాలు నిర్వహించి అందులో పాల్గొన్నారు. టాస్క్‌ఫోర్స్ సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ వర్ధన్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి కేసు నమోదు చేశారు. పోలీసుల నిషేధం మరియు హెచ్చరికలు ఉన్నప్పటికీ సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు తమిళనాడులో విస్తృతంగా ప్రబలంగా…