Cristiano Ronaldo: లెజెండరీ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతను ఏం చేసినా అది సెన్సేషనల్‌గా మారుతుంది. ఇటీవల, క్రిస్టియానో రొనాల్డో చేసిన ఒక పనిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. క్రిస్మస్ సెలవులను తన కుటుంబంతో కలిసి ఆస్వాదించడానికి, రొనాల్డో ఫిన్‌లాండ్‌లోని లాప్‌లాండ్‌కు వెళ్లారు. అక్కడ జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. రొనాల్డో చలిగా ఉన్న ప్రాంతంలో తిరుగుతూ మైనస్ 20…