పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ చిత్రం ఈ నెల 29న విడుదలకు సిద్ధం అవుతోంది. నిజానికి ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఓ వారం ముందుగానే థియేటర్లలో సందడికి రెడీ అవుతోంది ‘రొమాంటిక్’. ఎనౌన్స్ మెంట్ పోస్టర్ తోనే అందరినీ ఆకట్టుకున్న ఈ సినిమాలో ఆకాశ్ కి జోడీగా కేతికా శర్మ నటించింది. ఈ సినిమాకు పూరి కథ, మాటలు, స్ర్కీన్ ప్లే అందించగా…