తమిళనాడులోని చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న విజీపీ అమ్యూజ్‌మెంట్ పార్క్ లో రోలర్ కోస్టర్ నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా పనిచేయకపోవడంతో భయానక వాతావరణం నెలకొంది. ఎనిమిది మంది పిల్లలు, పది మంది మహిళలు సహా ముప్పై మంది దాదాపు మూడు గంటల పాటు 70 అడుగుల ఎత్తులో చిక్కుకుపోయారు. మూడు గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు పర్యాటకులు. పైకి వెళ్ళిన రోలర్ తిరిగి కిందకు వచ్చే సమయంలో సాంకేతికత లోపం కారణంగా ఆగిపోయింది.…