ఆర్ కె. రోజా..నగరి ఎమ్మెల్యేగా వున్న రోజాకు మంత్రిపదవి గ్యారంటీ అంటున్నారు. జగన్ కేబినెట్లో చివరి నిమిషంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఊహించిన విధంగా పాత మంత్రులకు 10 మందికి అవకాశం దక్కగా..కొత్తగా 15 మందిని ఎంపిక చేసారు. అందులోనూ చిత్తూరు జిల్లా నుంచి ఫైర్ బ్రాండ్ కి బెర్త్ కన్ఫర్మ్ అయిందని అంటున్నారు. జాబితాలో ఆమె పేరు కనిపిస్తోంది. చిత్తూరు జిల్లా నుంచి మూడో మంత్రిగా రోజాకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో…