భారత్, న్యూజిలాండ్ వన్డే సందర్భంగా ఇండోర్‌లో చోటుచేసుకున్న ఓ అనూహ్య ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. భారత క్రికెట్ జట్టు బస చేసిన హోటల్‌లోకి భద్రతను ఉల్లంఘిస్తూ ఓ మహిళ ప్రవేశించి.. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చేతిని పట్టుకుని సహాయం కోరడం కలకలం రేపింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. హిట్‌మ్యాన్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైనట్లు అందులో కనిపించాడు. వెంటనే భద్రతా సిబ్బంది స్పందించి మహిళను అదుపులోకి తీసుకున్నారు.…