టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే టీ20, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. హిట్‌మ్యాన్ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలని చూస్తున్నాడు. ఎందుకంటే.. వన్డే ప్రపంచకప్ రోహిత్ కల అని తెలిసిందే. టీ20, టెస్ట్‌లకు వీడ్కోలు పలికిన హిట్‌మ్యాన్.. ఇప్పుడు పూర్తిగా వన్డేలపై మాత్రమే దృష్టి పెట్టాడు. అయితే రోహిత్‌ను టీమ్ నుంచి తప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన ఆరోపణలు చేశాడు.…