Rohit Sharma React About Fitness Critics: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ఆటతో పాటుగా ఫిట్‌నెస్ పరంగానూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. లావుగా ఉన్నాడని, పొట్ట వచ్చేసిందని.. చాలాసార్లు రోహిత్ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వడా పావ్, సాంబార్ అంటూ తరచూ ట్రోల్స్‌కి గురవుతుండేవాడు. తాజాగా ఈ విమర్శలపై రోహిత్ ఘాటుగా స్పందించాడు. తాను 500 అంతర్జాతీయ మ్యాచ్‌ల మైలురాయికి చేరువలో ఉన్నానని, ఫిట్‌నెస్ లేకుండానే ఇన్ని మ్యాచ్‌లు ఎలా ఆడగలిగా…