Women's Day: మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో, మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్సీపీ -శరద్ పవార్ మహిళా విభాగం అధ్యక్షురాలు రోహిణి ఖడ్సే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సంచలన లేఖ రాశారు. మహిళలు అణచివేత మనస్తత్వం, అత్యాచార మనస్తత్వం, నిష్క్రియాత్మక శాంతిభద్రత ధోరణిని చంపాలనుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల ముంబైలో 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారాన్ని లేఖలో ఖడ్సే పేర్కొన్నారు.