క్రీడా ప్రపంచంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ అంతర్జాతీయ జుజిట్సు క్రీడాకారిణి రోహిణి కలాం ఆత్మహత్య చేసుకుంది. 2022 ఆసియా క్రీడల్లో భారతదేశానికి రోహిణి కలాం ప్రాతినిధ్యం వహించింది. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో తన ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.
రాధాగంజ్‌లోని అర్జున్ నగర్ నివాసి అయిన అంతర్జాతీయ జుజిట్సు క్రీడాకారిణి, మార్షల్ ఆర్ట్స్ కోచ్ రోహిణి కలాం (35) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నివేదికల ప్రకారం, రోహిణి అష్టాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో మార్షల్ ఆర్ట్స్ కోచ్‌గా పనిచేస్తుందని.. నిన్ననే దేవాస్‌కు తిరిగి వచ్చిందని వెల్లడించాయి. కుటుంబ సభ్యుల ప్రకారం, ఆదివారం ఉదయం రోహిణి బాగానే ఉన్నట్లు తెలిపారు. అల్పాహారం తర్వాత, ఆమెకు ఫోన్ కాల్ వచ్చిందని.. ఆ తర్వాత ఆమె గదిలోకి వెళ్లి లోపలి…