రోహింగ్యాలు, స్లీపర్ సెల్స్‌పై దృష్టి పెట్టండని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్తత అవసరమన్నారు. దేశ, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని.. రాష్ట్ర వ్యాప్తంగా అంతర్గత భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీపీకి ఆయన లేఖ రాశారు. ‘రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్తత అవసరం. తీర ప్రాంత జిల్లాల్లో ప్రత్యేక…
Parliamentary Panel: భారత్‌లోకి నానాటికి బంగ్లాదేశ్, రోహింగ్యాల వలసలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో పాటు పలు రాష్ట్రాల్లో వీరు స్థిరపడటం భద్రతా పరమైన చిక్కుల్ని తీసుకువస్తోంది. ఇదిలా ఉంటే, ఈ రోహింగ్యా, బంగ్లాదేశీయుల వలసలపై హోం వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది.
Amit Shah: ఢిల్లీలో అక్రమ బంగ్లాదేశీయలు, రోహింగ్యాలే టార్గెట్‌గా ఈ రోజు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక సమీక్ష నిర్వహించారు. శాంతిభద్రతలు, అభివృద్ధి అంశాలపై ఆయన సమావేశం నిర్వహించారు. సమీక్షకు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, ఢిల్లీ హోం శాఖ మంత్రి ఆశిష్ సూద్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ హాజరయ్యారు. ఢిల్లీని సేఫ్ క్యాపిటల్ గా అభివృద్ధి చేయాలని అమిత్ షా ఆదేశించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో కూడిన కెమెరాలతో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రత్యేక కెమెరాలను సరిహద్దు భద్రతా దళం (BSF) భద్రతను పెంచడానికి, చొరబాటుదారులను నిరోధించడానికి వినియోగిస్తోంది.