పంజాబ్‌లోని మోగాలో ఖలిస్తానీ వేర్పాటువాది అమృతపాల్ సింగ్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అకల్ తఖ్త్ మాజీ చీఫ్, జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే మేనల్లుడు జస్బీర్ సింగ్ రోడే అమృతపాల్ అరెస్టుకు మార్గం సుగమం చేసినట్లు భావిస్తున్నారు. మోగాలోని రోదేవాల్ గురుద్వారాలో అమృతపాల్ సింగ్ లొంగిపోవాలని యోచిస్తున్నట్లు సమాచారం అందుకున్న జస్బీర్ సింగ్ రోడే రహస్యంగా పోలీసులకు సమాచారాన్ని పంచుకున్నాడు.