హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళా భవన్‌లో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు–2026 (సడక్ సురక్ష – జీవన్ రక్ష) ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా 30 సంవత్సరాలకు పైగా డ్రైవింగ్ చేస్తూ ఒక్క ప్రమాదం కూడా చేయని 18 మంది ప్రమాద రహిత డ్రైవర్లకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పురస్కారాలు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి, ఈడీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.…