Operation Karregutta : ములుగు జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న కర్రెగుట్ట ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. వాజేడు మండలం మొరుమూరు సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపు నుండి కర్రెగుట్టల వరకు రహదారి నిర్మాణ పనులకు గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీ అనిల్ కుమార్ భూమిపూజ చేయడంతో, ఈ ప్రాంతంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లైంది. మొరుమూరు గ్రామం నుంచి పామునూర్, జెల్లా, డోలి, తడపాల, చెలిమల గ్రామాల మీదుగా కర్రెగుట్టల…
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ రహదారుల పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించింది.. సాస్కి.. (Special Assistance for Capital Investment) పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.2వేల కోట్లు మంజూరు చేశారు.. ఈ నిధులను వినియోగించి గ్రామాల్లో దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్లను పునర్నిర్మించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు. రహదారుల నిర్మాణంలో నాణ్యత విషయంలో…
Pawan Kalyan: గిరిజన ప్రాంతాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. పంచాయతీరాజ్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఏపీ డిప్యూటీ సీఎం.. గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికారులకు ఆదేశించారు. అడవితల్లి బాట పనులను వేగవంతం చేయాలన్నారు. సవాళ్ళు ఎదురైతే ప్రణాళికాబద్ధంగా అధిగమించాలి.. డోలీరహిత గిరిజన నివాసాలు ఉండాలన్నాదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుర్తు చేశారు.
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో మొత్తం రూ. 630.27 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని చేపట్టినవి. ముఖ్య అభివృద్ధి పనుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి: విద్యా రంగ అభివృద్ధి రూ. 200 కోట్లు: జాఫర్‌గఢ్ మండలంలోని కోనాయాచలం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ రూ. 5.5 కోట్లు: ఘన్‌పూర్…
Road Construction : భారతదేశంలో రోడ్ల నిర్మాణ వేగం తగ్గబోతోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇది 7-10 శాతానికి తగ్గుతుందని అంచనా. 2024 ఆర్థిక సంవత్సరంలో 12,350 కి.మీ రోడ్లు నిర్మించబడ్డాయి.
Tummala Nageswara Rao : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని పూసుకుంట, కటుకూరు గ్రామాలలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రాష్ట్ర వ్యవసాయ, చేనేత అనుబంధ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఆయన ఈ సందర్బంగా ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కలెక్టర్ జితిష్ వి పాటిల్, ఐటిడి పిఓ రాహుల్ తో కలిసి పూసుకుంట నుండి రాచన్నగూడెం బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. శనివారం పూసుకుంటకు చేరుకున్న…
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని గ్రామాలకు రవాణా సదుపాయాలను మెరుగుపర్చేందుకు రూ.224 కోట్ల మేరకు సెంట్రల్ రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (CRIF) నిధులు మంజూరు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ రోజు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు.
సంక్రాంతిలోగా రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై గుంతలను పూడ్చి వేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం రోడ్ల పనులకు రెన్యూవల్ చేయలేదని, ప్రజలు ఇబ్బందులు పడ్డారని.. టూరిజంకు భారీ నష్టం వాటిల్లిందని మంత్రి తెలిపారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా.. జాతీయ రోడ్డు రవాణా, రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశమయ్యారు. ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అనురాగ్ జైన్కు మంత్రి తెలిపారు. అలాగే.. నల్గొండ బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని త్వరగా చేపట్టేందుకు ఎస్ఎఫ్సీ (స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ) మీటింగ్ ఏర్పాటు చేసి త్వరగా టెండర్లు పిలవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.