Road Accident: పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బర్దమాన్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తీర్థయాత్రికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు రోడ్డు పక్కన నిలిచి ఉన్న ట్రక్‌ను వెనుకనుంచి ఢీకొనడంతో 10 మంది అక్కడికక్కడే మృతిచెందగా, మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం తూర్పు బర్దమాన్‌లోని జాతీయ రహదారి (NH -19) పై నలా ఫెరీఘాట్ వద్ద ఉదయం సుమారు 7.30 గంటలకు చోటుచేసుకుంది.
Suspicious Death: హత్యా? ఆత్మహత్యా? నర్సింగ్ హోంలో నర్సు అనుమానాస్పద మృతి!
ఇక అక్కడి ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ట్రక్ రోడ్డుకు అంచున నిలిపివుంచబడింది. అయితే బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం వల్ల ఆ ప్రాంతంలో రహదారి రవాణాకు కొంతసేపు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక పోలీసుల సమాచారం ప్రకారం, బస్సులోని అందరు ప్రయాణికులు బీహార్ లోని మోటియార్ థానా పరిధి, చిరయ్యా సరసావా ఘాట్ ప్రాంతానికి చెందినవారు. వీరంతా గంగాస్నానం చేసేందుకు వచ్చి, తిరిగి స్వగ్రామాలకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సులో మొత్తం 45 మంది ఉండగా, వారిలో ఐదుగురు పిల్లలు కూడా ఉన్నారు. గాయపడిన వారిని తూర్పు బర్దమాన్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు.
HHVM : హరిహార వీరమల్లు నష్టాలు.. తిరుగుబాటుకు రెడీ అవుతున్న బయ్యర్స్
ప్రమాదానికి డ్రైవర్ నిద్ర మత్తే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన అనంతరం పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని, గాయపడిన వారిని, అలాగే మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.