రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స కోసం నితిన్ గడ్కరీ పథకాన్ని ప్రకటించారు. ప్రమాదం జరిగిన 24 గంటల్లో పోలీసులకు సమాచారం అందించిన తర్వాత... బాధితులకు గరిష్టంగా రూ. 1.5 లక్షల చికిత్స ఖర్చు తక్షణమే అందజేస్తుందని గడ్కరీ చెప్పారు.
రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బాధితులకు సకాలంలో చికిత్స అందించే ఉద్దేశంతో గోల్డెన్ అవర్ పేరుతో మోడీ ప్రభుత్వం మరో కొత్త పథకం అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.