చిత్తూరు శివారు ప్రాంతం గంగాసాగరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున ఆగివున్న టిప్పర్‌ను ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులోని నలుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను వేలూరు సీఎంసీ, నరివి ఆస్పత్రులకు తరలించారు. ట్రావెల్స్ బస్సు తిరుపతి నుంచి మధురై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం 20 అడుగులు జారుకుంటూ రోడ్డు…