మావోయిస్టు టాప్ లీడర్ ఆర్కే.. అనారోగ్య సమస్యలతో కన్నుమూశారంటూ ఛత్తీస్‌గఢ్ పోలీసులు ప్రకటించినా.. మావోయిస్టులు అధికారిక ప్రకటన విడుదల చేయడానికి కాస్త సమయం తీసుకున్నారు.. శుక్రవారం మధ్యాహ్నం ఆర్కే మరణంపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికారిక ప్రకటన చేసింది. కిడ్నీల సమస్యతో ఈనెల 14న ఆర్కే మరణించారని ఆ పార్టీ నేత అభయ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.. ఇక, ఆర్కే అంత్యక్రియలను పూర్తి చేశారు మావోయిస్టులు.. తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించారు..…
మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్కే) ఇక లేరని చెబుతున్నారు పోలీసులు.. బీజాపూర్ అడవుల్లో ఆయన చనిపోయినట్టుగా తెలుస్తోంది.. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆర్కే.. ఇవాళ కన్నుమూశారని తెలుస్తోంది.. ఇక, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పోలీసులు-మవోయిస్టుల మధ్య జరిగిన చర్చల్లో కీలక పాత్ర పోషించారు రామకృష్ణ.. చాలా సమయాల్లో పెద్ద పెద్ద ఎన్‌కౌంటర్ల నుంచి చివరి నిమిషంలో ఆయన తప్పించుకున్నారు. భారీ ఎన్‌కౌంటర్ జరిగిన ప్రతీ సందర్భాల్లోనూ ఆర్కే చనిపోయారా? లేదా బతికే ఉన్నారా?…