Bihar Elections 2025: బీహార్ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై ఆర్‌జేడీ–కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌లో అస్పష్టత నెలకొన్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా రాజకీయ గందరగోళం మధ్య, పాట్నాలో నాటకీయ దృశ్యం ఆకట్టుకుంది. మధుబన్ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశించిన మదన్ షా వింత చేష్టలతో వార్తల్లో నిలిచారు. సర్క్యులర్ రోడ్‌లోని 10వ నంబర్‌లోని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నివాసం వెలుపల గందరగోళం సృష్టించారు. మదన్ షా లాలు నివాసం గేటు బయట తన…