నాగశౌర్య, రీతూవర్మ తొలిసారి జంటగా నటించిన సినిమా ‘వరుడు కావలెను’. గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ కు ముందు వచ్చిన నాగశౌర్య ‘అశ్వద్థామ’ చిత్రం కమర్షియల్ గా ఆశించిన స్థాయి విజయాన్ని పొందలేకపోయింది. అదే యేడాది రీతూవర్మ హీరోయిన్ గా నటించిన ‘కనులు కనులను దోచాయంటే’ మూవీకి హిట్ టాక్ వచ్చినా, కలెక్షన్లపై కరోనా దెబ్బ పడింది. ఈ యేడాది రీతూవర్మ నటించిన ‘నిన్నిలా – నిన్నిలా’, ‘టక్ జగదీశ్’ చిత్రాలు ఓటీటీలోనే స్ట్రీమింగ్ అయ్యాయి.…
యంగ్ హీరో నాగశౌర్య దసరాను టార్గెట్ చేశాడు. తాజాగా ఆయన నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ “వరుడు కావలెను”. ఈ సినిమా విడుదల తేదికి ముహూర్తం ఖరారు చేశారు మేకర్స్. ఈ విషయాన్ని ప్రకటిస్తూ తాజాగా ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ “వరుడు కావలెను” సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని…