Uttarakhand Floods: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో క్లౌడ్ బ్రస్ట్ నేపథ్యంలో భారీ వరదలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రభావంతో రిషికేశ్‌లోని పరమార్థ నికేతన్ ఆశ్రమం వద్ద గంగా నది ఉధృతంగా ప్రవహించి, అక్కడి హారతి స్థలంలో ఉన్న శివుడి విగ్రహం పాదాలను తాకింది. ప్రస్తుతం అన్ని ఘాట్లు మూసివేయగా, నదీ తీరం వద్ద ప్రజల ప్రవేశాన్ని అధికారులు అనుమతించడం లేదు. ఈ ఘటన నేపథ్యంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రాష్ట్ర అత్యవసర కేంద్రంలో సమీక్ష…