టీ20ల్లో చివరి ఓవర్‌లో అద్భుతాలు చేసే టీమిండియా బ్యాటర్ రింకూ సింగ్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. రంజీ ట్రోఫీ 2025/26 సీజన్ ఎలైట్ గ్రూప్ ఎలో భాగంగా కోయంబత్తూరులో తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ తరఫున ఆడుతున్న రింకూ భారీ శతకంతో చెలరేగాడు. 247 బంతుల్లో 17 ఫోర్లు, ఆరు సిక్సర్లు బాది ఉత్తరప్రదేశ్ జట్టు ఆధిక్యం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. రింకూ ఇన్నింగ్స్‌తో యూపీ ఖాతాలో మూడు పాయింట్లు సాధించింది. డ్రా…