ఆ జిల్లాలో ఆయన చెప్పినట్టు చేయకపోతే అంతేనట. ప్రజాప్రతినిధులతో పొసగకపోతే.. ఎంతటి వారికైనా పొగపెట్టేస్తారట. ఆ ఆస్పత్రి డైరెక్టర్ విషయంలో అదే జరిగిందని కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. అదే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. సమస్య ముదిరి డైరెక్టర్ కుర్చీ కదిలింది! ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి ఇటీవల కాలంలో ఎక్కువగా వివాదాల్లో ఉంటోంది. డైరెక్టర్‌గా ఉన్న బలరాం నాయక్‌ను మార్చి కొత్తగా డాక్టర్ కరుణాకర్‌ను వేయడంతో మరోసారి చర్చల్లోకి వచ్చింది. ముక్కుసూటిగా ఉండటం వల్లే…