పాకిస్థాన్ వంచనను మరోసారి యూఎన్ వేదికగా భారత్ ఖండించింది. యూఎన్‌లో భారత దౌత్యవేత్త భావిక మనగలనందన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. పీఓకేలో పాకిస్థాన్ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుందని.. దీన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ ద్వంద్వ మాటలు, కపటత్వాన్ని బయటపెట్టారు.
ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం అయింది. మహిళలకు రాజకీయాల్లోకి ఆహ్వానిస్తామని తాలిబన్లు చెబుతున్నారు. అయితే, ఇస్లామిక్ చట్టాల ప్రకారమే వారికి అవకాశం ఉంటుందని తాలిబన్లు చెబుతున్నారు. ప్రజలందరికీ క్షమాభిక్ష పెడుతున్నట్టు ఇప్పటికే తాలిబన్లు ప్రకటించినా, భయాందోళనలు ఏ మాత్రం తొలగిపోలేదు. ప్రజలు భయపడుతూనే ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే, కొంత మంది మహిళలు కాబూల్‌లో ప్లకార్డులు పట్టుకొని వీధుల్లో నిలబడి నిరసనలు తెలిపారు. మహిళలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అలాంటి కాబూల్‌లో తాలిబన్లకు వ్యతిరేకంగా, మహిళలకు స్వేచ్చ కల్పించాలని,…