బతుకు బండిని లాక్కెళ్లేందుకు ఒక్కొక్కరిది ఒక్కోక్క దారి. ఏదో ఒకలా సంపాదించి పొట్ట నింపుకునే కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. ఏదోలా నాలుగు రాళ్లు సంపాదించి కుటుంబాన్ని, పిల్లల్ని పోషించుకుంటారు. దొరికిన పని చేస్తూ.. డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అలాగే ఓ వ్యక్తి తన రెండు చేతులు లేకున్నప్పటికీ తానే డెలివరీలు చేయడమే కాకుండా స్కూటర్‌ను స్వయంగా నడుపుతున్నాడు.
సాధారణంగా పెంపుడు జంతువులను కార్లలో కానీ, బైకులపై కానీ ఎక్కించుకుని పోతుంటాం. అంతేకాకుండా ఏదైనా ఊరికి వెళ్లినప్పుడు కూడా వాటిని వదిలి ఉండలేక తమతో పాటు బస్సుల్లో, కార్లలో, బైకులపై తీసుకెళ్తారు. కానీ ఓ వ్యక్తి భారీకాయం ఉన్న ఎద్దును తన బైక్ పై ముందు కూర్చోపెట్టుకుని తీసుకెళ్తున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Viral: ఈ మధ్య అమ్మాయిలు అబ్బాయిలతో పాటు డ్రైవింగ్లో దూసుకుపోతున్నారు. కానీ కొన్ని సార్లు వాళ్లు చేసే తప్పిదాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియో ఇప్పుడు తెగ హల్ చల్ చేస్తోంది. ఆ అమ్మాయి సరైన సమయంలో బ్రేక్‌లను నొక్కడానికి బదులుగా యాక్సిలేటర్ను తిప్పింది.