ఈజీమనీ కోసం దారుణమయిన మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్ళు. నమ్మితే చాలు నట్టేటముంచుతున్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో చెంబుకి అతీతశక్తులు ఉన్నాయని మోసం చేస్తున్న రైస్ పుల్లింగ్ ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. వారి గుట్టును రట్టుచేశారు. చెంబుకి కెమికల్స్ అద్ది బియ్యాన్ని ఆకర్షించేలా చేసింది రైస్ పుల్లింగ్ ముఠా. దీనిని నమ్మేశారు అమాయక జనం. యూట్యూబ్ లో చూసి మోసాన్ని ఎలా చేయాలో నేర్చుకుంది ముఠా. గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి ముఠాను కాంటాక్ట్ చేశారు. అంతే…