ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. ఒళ్లు కాలి మరొకడు ఏడ్చాడని వెనుకటికి ఒక సామెత ఉంది. ఇప్పుడు ఈ సామెత హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్‌కు సరిగ్గా సరిపోతుంది. ఉన్నోడు కార్లలో తిరుగుతూ ట్రాఫిక్ జామ్‌లకు కారణమవుతుంటే.. లేనోడు బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణిస్తూ ట్రాఫిక్‌జామ్‌లలో ఇరుక్కుపోయి నానా అవస్థలు పడుతున్నాడు. ట్రాఫిక్‌జామ్‌కు భారీ వర్షాలే కారణమని వాదించవచ్చు. కానీ అది 30 శాతం మాత్రమే. మిగతా 70 శాతం నానాటికీ పెరుగుతున్న కార్ల ట్రాఫిక్‌ను ప్రభుత్వాధికారులు అదుపు చేయలేకపోవడం…