ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. ఒక్క రాత్రిలో నీటిపాలైంది. వరుణుడి ధాటికి రైతన్న లబోదిబోమంటున్నాడు. బుధవారం వేకువజామున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసింది. భారీగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురియడంతో వరిధాన్యం కుప్పలు తడిసి ముద్దాయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లో సరిపడ టార్ల్పిన్ కవర్లు లేకపోవడంతో వర్షపు నీటిలో వరి ధాన్యం కొట్టుకోయింది. దీంతో రైతన్నలు కన్నీరు కార్చుతున్నారు. మొన్నటి వరకు ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత రాక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతన్నలు.. ఇప్పుడు వర్షా ధాటికి ఎంతో…