రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మార్షల్ ఆర్ట్ మూవీ ‘లడకీ’ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. యాక్షన్ తో పాటు కుర్రకారుని ఆకట్టుకునే మసాలా సన్నివేశాలకూ వర్మ ఈ ట్రైలర్ లో చోటిచ్చాడు. ఈ ట్రైలర్ విడుదల కాగానే అమితాబ్ బచ్చన్ మొదలుకొని పలువురు సినీ ప్రముఖులు వర్మకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్ట్ సి మీడియా, చైనా కు చెందిన బిగ్ పీపుల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. దాంతో ఈ సినిమాను హిందీలో పాటు చైనీస్ భాషలోనూ…