లక్షలాది మంది అభిమానులను, సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేస్తూ లెజెండరీ గేయ రచయిత పద్మశ్రీ చెంబోలు సీతారామశాస్త్రి 66 ఏళ్ళ వయసులో ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధిత సమస్యలతో మంగళవారం (నవంబర్ 30) సాయంత్రం 4:07 గంటలకు తుది శ్వాస విడిచారు. నవంబరు 24న న్యుమోనియా కారణంగా సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆయన ఐసీయూలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సిరివెన్నెల భౌతికకాయాన్ని అభిమానులు, సినీ పరిశ్రమ శ్రేయోభిలాషుల కోసం ఈరోజు ఉదయం 7 గంటలకు…