కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కోల్‌కతాలో హత్యాచారానికి గురైన వైద్యురాలి తండ్రి లేఖ రాశాడు. తమ కుటుంబం తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు లేఖలో తెలిపారు. తమ కుమార్తెకు జరిగిన అమానవీయ ఘటనతో మా కుటుంబం మొత్తం తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటోందని లేఖలో ఆయన పేర్కొన్నారు.