జగదీప్ ధన్కడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవి కోసం త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఈ అంశంపై తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగదీప్ ధన్కడ్ రాజీనామా బాధాకరమన్నారు.
కేసీఆర్, జగన్ ఒప్పందంలో భాగంగానే ప్రస్తుతం ఏపీలో ప్రాజెక్టులు కడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బేసిన్‌లు లేవు భేషజాలు లేవు అన్న కేసీఆర్ మాటలను గుర్తు చేశారు. తాజాగా ప్రాజెక్టుల అంశంపై ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో సీఎం మాట్లాడారు. గోదావరి జలాలు పెన్నాకు తీసుకెళ్తా అని చెప్పి.. ఏపీని ప్రోత్సహిస్తాం అని చెప్పింది కేసీఆర్ అని తెలిపారు.